CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 4:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నేడు నక్కర్తలో వినాయక నిమజ్జనం

  • సాయంత్రం 6.35 గంటలకు.. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు

యాచారం, సెప్టెంబరు 23 (చైతన్యగళం): యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలోని నక్కర్త హనుమాన్‌ దేవాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జనం బుధవారం సాయంత్రం 6.35 గంటలకు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింధం అంజయ్య, పాలకవర్గ సభ్యులు తెలిపారు. నిమజ్జనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.