గణేష్‌ నిమజ్జనానికి పటిష్ఠ భద్రత

20 వేల మంది పోలీసులతో బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): గణేష్‌ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌ పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న నగరవ్యాప్తంగా గణేష్‌ శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు, ట్రాఫిక్‌ ఆంక్షలను ప్రకటించారు. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణనాథుల నిమజ్జనాల నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో సుమారు 20 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొననుండగా.. ఇతర...