ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

18,700 మంది ఓటర్లు హియరింగ్‌కు హాజరు కావాలి: అదనపు కలెక్టర్‌ చెన్నయ్య నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం‌): జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చెన్నయ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఐఆర్‌ పురోగతిని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 96,911 మంది ఓటర్లకు హియరింగ్‌ పూర్తయిందని, మరో 18,700 మంది నోటీసులు అందుకుని హియరింగ్‌కు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు బీఎల్‌ఓల సమక్షంలో...