విద్యుత్ సరఫరాపై సర్వసభ్య సమావేశంలో రసాభాస
త్రీఫేస్ కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని సర్పంచుల ఆగ్రహం మర్రిగూడ, సెప్టెంబరు 22 (చైతన్యగళం): మర్రిగూడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యుత్ సరఫరాపై వాడీవేడిగా చర్చ జరిగింది. యరగండ్లపల్లి సర్పంచ్ వల్లెంల సంతోష్‌యాదవ్, రాజపేట తండా సర్పంచ్ కోడాల వెంకట్‌రెడ్డి విద్యుత్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో త్రీఫేస్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వీధిదీపాలు పనిచేయడం లేదని వారు ఆరోపించారు. విద్యుత్ స్తంభాలు కావాలని కోరినా అందించడం లేదని, విద్యుత్...