శాతవాహన ఇంజినీరింగ్ కళాశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ
హుస్నాబాద్, సెప్టెంబరు 23 (చైతన్యగళం): హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల, వసతి గృహంలోని వసతులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను నమోదు చేసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. సిబ్బందిలో ఒకరు ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు....