CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 7:24 am Posted by : CHAITHANYA GALAM NEWS

వినాయక మండపం వద్ద ఘనంగా అన్నదానం

  • భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు

చిగురుమామిడి, సెప్టెంబరు 22 (చైతన్యగళం): మండలంలోని నవాబుపేట గ్రామంలో శ్రీ ఆంజనేయ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గూళ్ల కవిత–రాజు, బుర్ర రజిత–శ్రీనివాస్‌ దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గణనాథుడిని దర్శించుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో మండపం సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.