CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 7:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం

  • ప్రపంచ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వ్యర్థాల తొలగింపు

మంచాల, సెప్టెంబరు 23 (చైతన్యగళం‌): ప్రపంచ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా తిరుమల మిల్క్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లాక్టాలిస్‌ ఇండియా గ్రూప్‌) గునగల్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలో ఎల్లమ్మతండాలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ప్లాంట్‌ మేనేజర్‌ ధర్మరాజు, సిబ్బంది కలిసి ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించారు. కార్యక్రమానికి సహకరించిన ఆలయ ధర్మకర్త చందునాయక్‌ను ప్లాంట్‌ మేనేజర్‌ ధర్మరాజు శాలువాతో సత్కరించారు.