యువ సంస్కృతి వారసత్వ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
జిల్లాస్థాయి పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థుల ప్రదర్శన హుస్నాబాద్, సెప్టెంబరు 22 (చైతన్యగళం): యువ సంస్కృతి, వారసత్వ జిల్లా స్థాయి పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణ, వనరుల కేంద్రంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వల్పచిత్రం, నాటిక, దృశ్య ప్రదర్శన, ప్రదేశాల పరిశుభ్రత, వారసత్వ నడక తదితర విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. హుస్నాబాద్ ప్రాంతంలోని చారిత్రక, పర్యాటక,...