ఫిజియోథెరపీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి
ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్ హైదరాబాద్, సెప్టెంబరు 22 (చైతన్యగళం): తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఫిజియోథెరపీ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.కందుల నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. 2017 తర్వాత రాష్ట్రంలో ఫిజియోథెరపిస్టుల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదన్నారు. తెలంగాణ...