క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు
కబడ్డీ క్రీడాకారులకు జెర్సీలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, సెప్టెంబరు 22 (చైతన్యగళం): క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను త్వరగా పొందవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 26 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న సిద్దిపేట జిల్లా జట్టును బుధవారం ఆయన అభినందించారు. హుస్నాబాద్‌లో గత పది రోజులుగా ప్రత్యేక శిక్షణ పొందుతున్న జిల్లా...