ప్రశాంత వాతావరణంలో గణేశ్‌ నిమజ్జనం నిర్వహించాలి

భద్రత, విద్యుత్‌, రవాణా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌, సెప్టెంబరు 22 (చైతన్యగళం): గణేశ్‌ నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 23న హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించనున్న నిమజ్జన ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రత, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, రవాణా నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీటి వసతి తదితర అంశాలపై ప్రత్యేక...