CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:19 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రమాద బీమా చెక్కు పంపిణీ

  • రూ.లక్ష చెక్కును అందజేసిన పీఏసీఎస్‌ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు

కోహెడ, సెప్టెంబరు 22 (చైతన్యగళం): కోహెడ మండలం రామచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన బొబ్బల కనకారెడ్డి రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. ఆయన కోహెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పంట రుణం కలిగి ఉండటంతో ప్రమాద బీమా కింద రూ.లక్ష పరిహారం మంజూరైంది.

మంజూరైన రూ.లక్ష బీమా చెక్కును పీఏసీఎస్‌ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కేడీసీసీబీ బ్యాంకు మేనేజర్‌ మోయిజ్‌ పాషా, కేడీసీసీబీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మహిపాల్‌, పీఏసీఎస్‌ కార్యదర్శి మల్లికార్జున్‌, నామిని తదితరులు పాల్గొన్నారు.