యూనియన్‌ బ్యాంక్‌లో గృహ రుణ సదుపాయం

ఇళ్ల నిర్మాణం, మరమ్మతులకు తక్కువ వడ్డీకే రుణాలు పెద్దపల్లి, సెప్టెంబరు 21 (చైతన్యగళం): ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక గృహ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. రీజినల్‌ హెడ్‌ కె.నటరాజ్‌ సూచనల మేరకు పెద్దపల్లి జెండా రోడ్డులోని బ్యాంకు శాఖలో సోమవారం పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైల్‌ రుణ విభాగం అధిపతి సంతోష్‌ మాట్లాడుతూ.. అర్హులైన వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో గృహ...