- అన్నప్రసాద వితరణలో పాల్గొన్న ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు
మర్రిగూడ, సెప్టెంబర్ 21 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని విశ్వజనని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బురుగు నాగరాజు గుప్త సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకుని పూజలు చేసి, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు నాగరాజు గుప్త తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ పూజారి మూర్తి, మిర్యాల రఘురాములు, మంచుకొండ రాంబాబు, మంచుకొండ కనకదుర్గ, గజవెల్లి రవికుమార్, గజవెల్లి శిరీష, గజవెల్లి చంద్రిక, బూరుగు భారతమ్మతో పాటు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.