మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే గిత్త దృష్టి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. వార్డులో పర్యటన నందికొట్కూరు, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): నందికొట్కూరు పట్టణంలోని ఎబీఎం పాలెంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం వార్డు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, కాలువల నిర్వహణ తదితర మౌలిక వసతులపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సంబంధిత మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. నందికొట్కూరు పట్టణాన్ని...