CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:47 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే గిత్త దృష్టి

  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. వార్డులో పర్యటన

నందికొట్కూరు, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): నందికొట్కూరు పట్టణంలోని ఎబీఎం పాలెంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం వార్డు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, కాలువల నిర్వహణ తదితర మౌలిక వసతులపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సంబంధిత మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

నందికొట్కూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వార్డులో ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

పట్టణ పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.