బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష

'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ దరఖాస్తులపై సమీక్ష.. గురుకులాలకు సొంత భవనాలపై దృష్టి హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (చైతన్యగళం): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం మంత్రుల నివాస సముదాయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం దరఖాస్తుల స్వీకరణ, అమలు, బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై చర్చించారు. కుట్టు మిషన్ల పథకానికి ఇప్పటివరకు 4.06 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు...