కుంగిన రోడ్డును పరిశీలించిన మంత్రి ఫరూక్

తక్షణ మరమ్మతులకు ఆదేశాలు నంద్యాల, సెప్టెంబర్‌ 20 (చైతన్యగళం‌): నంద్యాల పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు ప్రధమనందికి వెళ్లే బ్రిడ్జిని ఆనుకుని ఉన్న రోడ్డు ఒకవైపు కోతకు గురై కూలిపోయింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహంతో రోడ్డు మార్జిన్‌ కోతకు గురైనట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనదారులకు ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే తాత్కాలిక...