CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:36 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా మద్దయ్య యాదవ్

నంద్యాల, సెప్టెంబర్‌ 20 (చైతన్యగళం):

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా జి.మద్దయ్య యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా మహాసభల్లో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జి జయరాజ్‌, ఎన్‌ఏజే నాయకుడు ఆకుల అమరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.గోరంట్లప్ప, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.హుస్సేనాఖాన్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, కళాశాల అధినేత రామకృష్ణారెడ్డి, త్రీటౌన్‌ సీఐ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విలేకరులు హాజరయ్యారు.