పాణ్యం, సెప్టెంబర్ 20 (చైతన్యగళం):
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి పరామర్శించారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన వడ్డే చంద్రమోహన్, గుడుంబాయి తండాకు చెందిన ఎన్.రాజునాయక్‌లను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులను కలిసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.