రూ.27 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం అంబర్‌పేట, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): అంబర్‌పేట డివిజన్‌ పటేల్‌నగర్‌ రాజయ్యగల్లీలో రూ.27 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్‌ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన పనులను ప్రారంభించారు. అనంతరం పటేల్‌నగర్‌లో స్థానికులతో మాట్లాడి మంచినీరు, వీధిదీపాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని...