CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 5:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జోనల్‌ క్రీడలకు రూ.20 వేల విరాళం

  • వాలీబాల్‌, ఖో-ఖో పోటీల నిర్వహణకు మాజీ కార్పొరేటర్‌ పద్మారెడ్డి సహకారం

బోడుప్పల్‌, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): ఎస్‌జీఎఫ్‌ ఘట్‌కేసర్‌ జోన్‌ ఆధ్వర్యంలో అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల వాలీబాల్‌, ఖో-ఖో టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌ బోడుప్పల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ నెల 22న వాలీబాల్‌, 23న ఖో-ఖో పోటీలు జరగనున్నాయి.

జోనల్‌ క్రీడల నిర్వహణతో పాటు విజేతలకు అందించే పతకాలు, జ్ఞాపికల కోసం బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ కార్పొరేటర్‌ సింగిరెడ్డి పద్మారెడ్డి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.అశోక్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల శారీరక విద్యా ఉపాధ్యాయుడు విద్యాసాగర్‌, సీనియర్‌ ఉపాధ్యాయుడు పి.వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.