సమస్యల పరిష్కారం కోరుతూ చెంచు గిరిజనుల ధర్నా

శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన శ్రీశైలం, సెప్టెంబరు 21 (చైతన్యగళం‌): చెంచు గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చెంచు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లమల్లలోని వివిధ చెంచుగూడాలకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వెంకటస్వామి, అంకన్న, ఐలేని కృష్ణుడు, ఈర్లయ్య, వెంకటేశం మాట్లాడుతూ.. శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. చెంచు గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు...