కొండ లక్ష్మణ్‌ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి

వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పద్మశాలి సంఘం నాయకులు కోహెడ, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని పద్మశాలి సంఘం బస్వాపూర్‌ గ్రామ అధ్యక్షుడు కొక్కుల రమేష్‌, గాదాసు భాస్కర్‌ కోరారు. సోమవారం కోహెడ మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్‌ బాపూజీ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ...