పెరుగు రాజన్న కుంట భూములకు ఆక్రమణల ముప్పు?

15 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు సర్వేలో గుర్తింపు.. హద్దులు ఏర్పాటు చేసినా కొనసాగుతున్నాయంటున్న గ్రామస్తులు కోహెడ, సెప్టెంబర్‌ 20 (చైతన్యగళం): మండలంలోని తీగలకుంటపల్లి శివారులోని పెరుగు రాజన్న కుంట భూముల పరిరక్షణపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్‌ 369లో మొత్తం 29 ఎకరాల కుంట భూమి ఉండగా.. సుమారు 15 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు సంయుక్త సర్వేలో గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. కుంట భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు ఫిర్యాదు చేసినట్లు...