కలెక్టరేట్లో గణనాథుడికి ఘన పూజలు
కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం): విఘ్నాలు తొలగి జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ కరీంనగర్ కలెక్టరేట్లో కొలువుదీరిన గణనాథుడికి జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా శనివారం ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు, సిబ్బందికి స్వయంగా భోజనం వడ్డించి వారితో ఆత్మీయంగా మెలిగారు. కలెక్టర్ స్వయంగా సిబ్బందికి భోజనం వడ్డించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విధి...