మహిళా సర్పంచ్‌ను బెదిరించిన వ్యక్తిపై కేసు
చిగురుమామిడి, సెప్టెంబర్ 19(చైతన్యగళం): చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌కు వాట్సాప్ ద్వారా అవమానకరమైన మెసేజ్‌లు, ఆడియో రికార్డింగులు పంపుతూ, ఆమె వ్యక్తిగత జీవితంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ బెదిరించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కత్తుల రమేష్‌పై చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై బి. జగదీశ్వర్ తెలిపారు. ఫిర్యాదుదారు అయిన మహిళా సర్పంచ్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వాట్సాప్ మెసేజ్‌లు, ఆడియో రికార్డింగులు తదితర ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా అందజేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఎలక్ట్రానిక్...