కాలువలకు వెంటనే నీళ్లు వదలాలి – బండి సంజయ్
సిరిసిల్ల , సెప్టెంబర్ 19 (చైతన్య గళం): రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలకు కాలువలు, చెరువుల్లో నీళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎస్సారెస్పీ పరిధిలోని కాలువల్లో నీళ్లు లేవని, ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సీఎం వెంటనే జోక్యం చేసుకుని కాలువలకు నీళ్లు విడుదల చేయాలని కోరారు. పరిస్థితి చేయి దాటకముందే నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సూచించారు. హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని,...