పాముకాటుపై అవగాహన సదస్సు

కల్వకుర్తి, సెప్టెంబర్‌ 18 (చైతన్యగళం‌):ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ పాముకాటు అవగాహన దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శ్రీపాద శర్వాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కల్వకుర్తి డివిజన్‌ డీఎంహెచ్‌వో భీమానాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమానాయక్‌ మాట్లాడుతూ.. పాములు సహజంగా మనుషులకు హాని చేయవని, వాటిని ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే కాటువేసే అవకాశం ఉంటుందన్నారు. పొలాల్లో, దట్టమైన గడ్డి ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు మోకాళ్ల వరకు బూట్లు, పొడవాటి ప్యాంట్లు ధరించాలని సూచించారు. ఇళ్ల పరిసరాలను చెత్తాచెదారం, పొడవాటి గడ్డి లేకుండా...