షాద్నగర్–ఆమనగల్ బస్సును పునరుద్ధరించాలి
కల్వకుర్తి, సెప్టెంబర్ 18 (చైతన్యగళం): షాద్నగర్ నుంచి ఆమనగల్ మీదుగా నడిచే కల్వకుర్తి డిపో బస్సును పునరుద్ధరించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్ కోరారు. ఈ మేరకు శనివారం కల్వకుర్తి డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ ఠాగూర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. నెల రోజులుగా బస్సు నిలిపివేయడంతో ఆమనగల్, తలకొండపల్లి మండలాలతోపాటు ఆయా గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో...