CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:01 pm Posted by : CHAITHANYA GALAM NEWS

షాద్‌నగర్‌–ఆమనగల్‌ బస్సును పునరుద్ధరించాలి

కల్వకుర్తి, సెప్టెంబర్‌ 18 (చైతన్యగళం‌): షాద్‌నగర్‌ నుంచి ఆమనగల్‌ మీదుగా నడిచే కల్వకుర్తి డిపో బస్సును పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్‌ కోరారు. ఈ మేరకు శనివారం కల్వకుర్తి డిపో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఠాగూర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ.. నెల రోజులుగా బస్సు నిలిపివేయడంతో ఆమనగల్‌, తలకొండపల్లి మండలాలతోపాటు ఆయా గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు దాసరి రవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.