వెల్దండలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
వెల్దండ, సెప్టెంబర్ 19 (చైతన్యగళం): మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ–వెంకటయ్యగౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. శ్రీరామ్‌నగర్ కాలనీ పరిసరాల్లో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించామన్నారు. దీంతో విద్యుత్ సమస్యలు పరిష్కారమై, సరఫరా మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బస్నమోని...