CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 12:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

నందికొట్కూరు, సెప్టెంబర్‌ 19 (చైతన్యగళం‌):

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 73వ జన్మదిన వేడుకలను కర్నూలులోని ఆయన నివాసంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నందికొట్కూరుకు చెందిన మాజీ కౌన్సిలర్‌ లాలు, టీడీపీ కార్యకర్త మోటు మురళీరెడ్డి తదితరులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. రాజశేఖర్‌రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.