హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు

వెల్దండ, సెప్టెంబర్‌ 19 (చైతన్యగళం‌): ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ వెల్దండలో బీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం సంబరాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాజీ ఉపసర్పంచ్‌ జంగిలి నిరంజన్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల అంశంపై కీలక పరిణామమని అన్నారు. దానం నాగేందర్‌ అనర్హతపై స్పీకర్‌ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసి, 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో...