CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:16 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు

వెల్దండ, సెప్టెంబర్‌ 19 (చైతన్యగళం‌):

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ వెల్దండలో బీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం సంబరాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాజీ ఉపసర్పంచ్‌ జంగిలి నిరంజన్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిరంజన్‌ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల అంశంపై కీలక పరిణామమని అన్నారు. దానం నాగేందర్‌ అనర్హతపై స్పీకర్‌ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసి, 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించిన విషయం తెలిసిందే.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గుద్దటి అరుణ ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు జంగిలి ప్రసాద్‌, పోలే అశోక్‌, సాజ్య, జంగిలి ప్రవీణ్‌, హనుమంతు, రాజు, అమర్‌సింగ్‌, భక్య, గంగాధర్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.