గణేష్‌ మండపం వద్ద విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

కల్వకుర్తి, సెప్టెంబర్‌ 18 (చైతన్యగళం‌): గణేష్‌ మండపం వద్ద విద్యుత్‌ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన ఘటన కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్‌ మైసమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్‌ మండపం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. తర్ణికల్‌ గ్రామానికి చెందిన జంపుల అరవింద్‌ (23) విద్యుత్‌ షాక్‌కు గురైనట్లు స్థానికుల వివరాల మేరకు తెలుస్తోంది. వర్షం కారణంగా మండపం వద్ద ఏర్పాటు చేసిన తోరణాలు కిందపడటంతో వాటిని పక్కకు తొలగించే ప్రయత్నంలో అరవింద్‌కు విద్యుత్‌...