బాల సదన్, శిశుగృహాన్ని పరిశీలించిన సీనియర్ సివిల్ జడ్జి

కరీంనగర్, సెప్టెంబర్ 18 (చైతన్యగళం): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ శుక్రవారం పట్టణంలోని బాల సదన్, శిశుగృహాలను సందర్శించి పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించిన ఆయన కష్టపడి చదివి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. బాల సదన్‌లోని సౌకర్యాలను పరిశీలించిన జడ్జి, అక్కడ అందుతున్న సౌకర్యాలు, పాటిస్తున్న పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు సౌకర్యాలను త్వరితగతిన మెరుగుపరచడంతో పాటు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు....