రైతులకు విస్తృతంగా రుణాలు అందించాలి – కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, సెప్టెంబర్ 18(చైతన్యగళం): ప్రాధాన్యత, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన రైతులకు విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని, అవసరమైతే రైతుల కోసం ప్రత్యేక రుణమేళాలు నిర్వహించాలని సూచించారు. వివిధ శాఖల నుంచి గ్రౌండింగ్ కోసం వచ్చిన దరఖాస్తులను...