భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా
చిగురుమామిడి, సెప్టెంబర్ 18(చైతన్యగళం): భూముల రీసర్వేను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిగురుమామిడి మండలం ఉల్లంపల్లిలో కొనసాగుతున్న భూముల రీసర్వేను కరీంనగర్ ఆర్డీవో షర్మిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులతో మాట్లాడి రీసర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేతో భూములకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే నిర్వహించే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి, వారి...