CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 11:57 pm Posted by : rakeshkashaveni12@gmail.com

హుజురాబాద్ పద్మనగర్‌లో ఘనంగా సామూహిక కుంకుమ పూజ

హుజురాబాద్, సెప్టెంబర్ 18 (చైతన్యగళం):

హుజురాబాద్ పట్టణంలోని పద్మనగర్‌లో గణేశుడి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహిళలు సామూహికంగా కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం గుండెటి మీనాక్షి, కనుకుంట్ల నరసింహులు సంయుక్తంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ రొంటాల సువాసిని మనోజ్ రావు, బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, 28వ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి రమేష్, 5వ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత బాబు, యువకులు, కమిటీ సభ్యులు, మహిళలు హాజరై పూజల్లో పాల్గొన్నారు.