వెలికట్ట భూములపై కాంగ్రెస్ ఆరా
హరీశ్‌రావు బంధువుకు చెందినవిగా పేర్కొంటున్న అసైన్డ్ భూముల పరిశీలన రికార్డులు, పహాణీలు.. బదలాయింపుపై అధికారులను ప్రశ్నించిన ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్ధిపేట, సెప్టెంబర్ 18 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని అసైన్డ్ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం శుక్రవారం ఆరా తీసింది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 271లో 6 ఎకరాల 2 గుంటల విస్తీర్ణంలో ఉన్న అసైన్డ్ భూములను బృందం పరిశీలించింది. ఈ భూములు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు...