- పార్థివదేహానికి నివాళులర్పించిన దారా సుధీర్
నందికొట్కూరు, సెప్టెంబరు 17 (చైతన్యగళం): పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గుండం శివన్న అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దారా సుధీర్ శివన్న నివాసానికి చేరుకున్నారు. పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం శివన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో శివన్న చురుగ్గా పాల్గొనేవారని దారా సుధీర్ గుర్తుచేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. శివన్న కుటుంబానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
శివన్న మృతి పట్ల స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.