ప్రజాపాలనలో పారదర్శకతే లక్ష్యం

సామాజిక న్యాయం.. సమాన అవకాశాలే ప్రభుత్వ ధ్యేయం ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 17 (చైతన్యగళం): ప్రజాపాలనలో పారదర్శకత, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల సంక్షేమం, జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సెప్టెంబరు 17ను పురస్కరించుకుని నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి...