సుల్తాన్‌పూర్‌లో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బేస్‌బాల్‌ సెలక్షన్‌

జూనియర్‌, యూత్‌ బాలబాలికల ఎంపిక పోటీలు ఎలిగేడు, సెప్టెంబరు 17 (చైతన్యగళం‌): ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామంలో 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బేస్‌బాల్‌ జూనియర్‌, యూత్‌ బాలబాలికల ఎంపిక పోటీలను గురువారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సాఫ్ట్‌బేస్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ముద్రవేణి సతీష్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరై ప్రతిభను ప్రదర్శించారు. సుల్తాన్‌పూర్‌ మినీ గ్రౌండ్‌లో జరిగిన పోటీలను రాష్ట్ర సాఫ్ట్‌బేస్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవికుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొట్యాల రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కప్పల...