- జూనియర్, యూత్ బాలబాలికల ఎంపిక పోటీలు
ఎలిగేడు, సెప్టెంబరు 17 (చైతన్యగళం): ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బేస్‌బాల్ జూనియర్, యూత్ బాలబాలికల ఎంపిక పోటీలను గురువారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సాఫ్ట్‌బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ముద్రవేణి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరై ప్రతిభను ప్రదర్శించారు.
సుల్తాన్‌పూర్ మినీ గ్రౌండ్‌లో జరిగిన పోటీలను రాష్ట్ర సాఫ్ట్‌బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొట్యాల రమేష్, జిల్లా అధ్యక్షుడు కప్పల ప్రవీణ్, సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య ప్రారంభించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తానిపర్తి రమేష్‌రావు, వివిధ జిల్లాల కార్యదర్శులు, మహేష్, నరేష్‌నాయక్, సాయి, కోతులు, మేనేజర్లు, సీనియర్ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.