సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష

సైబర్ సేఫ్ గణేష్‌ను సందర్శించిన ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్, సెప్టెంబర్ 17(చైతన్యగళం): గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన “సైబర్ సేఫ్ గణేష్” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సందర్శించారు. గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన సైబర్ భద్రత అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. గణేష్ ఉత్సవాలను సైబర్ భద్రత అవగాహనతో అనుసంధానం చేయడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్ వంటి బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు....