CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 11:42 am Posted by : CHAITHANYA GALAM NEWS

సంగయ్యపేట గణనాథుడికి ప్రత్యేక పూజలు

  • పూజల్లో పాల్గొన్న శంకర్‌గౌడ్‌

నందికొట్కూరు, సెప్టెంబరు 17 (చైతన్యగళం): పట్టణంలోని సంగయ్యపేటలో స్నేహ యూత్‌ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శంకర్‌గౌడ్‌, శివగౌడ్‌ పర్యవేక్షణలో గురువారం ఏర్పాటు చేసిన గణనాథుడికి శంకర్‌గౌడ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

వినాయక చవితి సందర్భంగా భక్తులు, కాలనీ ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్‌గౌడ్‌ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో సంగయ్యపేట ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో కాలనీ ప్రజలు ఏకమై పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు యుగంధర్‌, గణేష్‌ పిలుపునిచ్చారు.