22-ఏ చట్టాన్ని రద్దు చేయాలి
ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చొద్దు:టీడీపీ సిద్దిపేట, సెప్టెంబరు 17 (చైతన్యగళం): రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22-ఏను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు కలెక్టరేట్‌లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ప్రైవేట్ ఆస్తులను తప్పుగా, పరిమితికి మించి చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సెక్షన్ 22-ఏ పరిధి, శాసన ఉద్దేశ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నిషేధిత ఆస్తుల జాబితాలోని రికార్డులను...