కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 17 (చైతన్యగళం): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో గురువారం జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పతాకావిష్కరణకు ముందు తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద...