హైదరాబాద్ సంస్థానం.. నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనం వరకు

సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించిన డా. కందుల నాగరాజు మానుకోట(చైతన్యగళం): హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను చారిత్రకంగా గుర్తుంచుకోవాల్సిన రోజుగా నేతాజీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. కందుల నాగరాజు పేర్కొన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల్లో దేశ రాజకీయ ఏకీకరణ కూడా ముఖ్యమైనదని తెలిపారు. హైదరాబాద్‌లో అసఫ్‌జాహీ పాలన 1724లో ప్రారంభమై, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం వరకు కొనసాగిందని పేర్కొన్నారు....